ప్రధాని మోదీతో భేటీ అయిన ఇవాంకా ట్రంప్!

  • కాసేపట్లో గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ ప్రారంభం
  • హెచ్ఐసీసీలో మోదీతో భేటీ అయిన ఇవాంకా
  • ద్వైపాక్షిక అంశాలపై చర్చ
హైదరాబాదులోని హెచ్ఐసీసీలో 8వ గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కాసేపట్లో ప్రారంభం కానుంది. సదస్సు ప్రాంగణానికి ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ లు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ, ఇవాంకాలు హెచ్ఐసీసీలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై వీరు చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి ఇరు దేశాలకు చెందిన విదేశాంగ శాఖల ప్రతినిధులు హాజరయ్యారు. ఇవాంకా ఎంతో అభిమానించే భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా భేటీలో ఉన్నారు. 
Go Back to Shorts
ivanka trump
Narendra Modi
hicc
Global Entrepreneurship Summit

More Telugu News